Nov 28,2020 22:27

సమస్యలపై డిఆర్‌ఒకు మోమోరాండ్రం అందచేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

గుంటూరు : రకరకాల కారణాలతో తిరస్కరించిన టీచర్‌ ఎమ్మెల్సీ ఓటర్లు డిసెంబర్‌ 1 నుంచి తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, కె.నాగమల్లేశ్వరరావు తెలిపారు. శనివారం యుటిఎఫ్‌ నాయకులు సమస్యలపై డిఆర్‌ఒ చంద్రశేఖర్‌ రెడ్డికి మోమోరాండ్రం అందచేశారు. త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని డిఆర్‌ఒ తెలిపారన్నారు. ప్రధానంగా దరఖాస్తులను ఏకారణంతో తిరస్కరించిందీ స్పష్టం చేయటం ద్వారా రెండోసారి దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుందన్నారు. బిఎల్‌ఒలు దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి మాత్రమే నిర్ధారించాలని, వారిని ఎక్కడో ఒక చోటకి పిలిపించటం సరికాదన్నారు. డిసెంబర్‌ 1న డ్రాఫ్ట్‌ లిస్ట్‌ విడుదల చేస్తారని, ఏ కారణంతోనైనా ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అర్హులైన వారు డిసెంబర్‌ 1 నుంచి 13వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డిఆర్‌ఒను కలిసిన వారిలో యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి యం.కళాధర్‌ ఉన్నారు.