గుంటూరు: దేశ వ్యాప్తంగా 26న జరిగే సమ్మెకు యుటిఎఫ్ సంపూర్ణ సంఫీభావం తెలియజేస్తుందని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్, కె.నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఆదివారం స్థానిక బ్రాడీపేటలోని యుటిఎఫ్ కార్యాలయం వద్ద సమ్మెకు సమ్మెకు సంఘీభావంగా పోస్టర్ ఆవిష్కరించారు. రాష్ట్ర సహాధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందన్నారు. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ప్రభుత్వ విద్యను పేద వర్గాలకు దూరం చేస్తుందన్నారు. ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు వివికె.సురేష్ మాట్లాడుతూ లాభాల్లో నడిచే రైల్వేలను ప్రైవేటీకరించారని, ఎల్ఐసి, బ్యాంకులనూ ప్రైవేటీకరించారన్నారు. ప్రభుత్వ రంగ రక్షణకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు బి.ఆదిలక్ష్మి, కోశాధికారి ఎం.కళాధర్, రాజశేఖర్, ఎండి.షకీలాబేగం, ఎన్వి జగదీష్‌కుమార్, కె.ప్రభూజీ తదితరులు పాల్గొన్నారు.
సమ్మె పోస్టర్ ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్ నాయకులు










