- జనసేన నాయకులు (మాజి ఎంపీటీసీ )సాయిబాబా. లక్ష్మణరావు. సురేష్. ప్రసాద్.
ప్రజాశక్తి-అరకు : అల్లూరి సీతారామరాజు అరకు నియోజకవర్గం కేంద్ర పరిధిలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం 11 గంటల సమయమున జనసేన పార్టీ ఆధ్వర్యంలో డుంబ్రిగుడ మండలం జనసేన పార్టీ మండల నాయకులు కొన్నేటి చిన్నరావుని ( జ్వర బాధితుడు ) మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో మంచనపడ్డ జ్వర బాధితులకు జనసేన బృందం వారి వద్దకు వెళ్లి పరామర్శించారు. అనంతరం ఈ సందర్భంగా అక్కడున్నటువంటి బాధితులతో ముఖాముఖి వారికి ఉన్నటువంటి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. అన్ని ఉన్నప్పటికీ బాధితులకు వేడి నీళ్లు సౌకర్యం కల్పిస్తే బాగుంటదని జనసేన దృష్టికి తీసుకువచ్చారు. దీనికై స్పందిస్తూ జనసేన పార్టీ(మాజీ ఎంపీటీసీ) సాయిబాబాదురియా. పార్లమెంట్ వర్కింగ్ కమిటీ నాయకుడు లక్ష్మణ్ రావు. ఉమ్మడి జిల్లా కార్య నిర్వహణ కమిటీ సభ్యులు ప్రధాని సురేష్. ముత్యం ప్రసాద్ తదితరులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సంబంధిత అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి, తక్షణమే జ్వర బాధితులకు వేడి నీళ్లు సౌకర్యం కల్పించాలని సూచించారు. దీనికై వేడి నీళ్లు బాధితులకు ఇచ్చే ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జన సైనికులు మహేష్. రమేష్ తదితరులు పాల్గొన్నారు.










