Sep 23,2023 15:31
  • సిపిఎంపార్టీ  మండల కమిటీ డిమాండ్ 

ప్రజాశక్తి-వి ఆర్ పురం : పోలవరం ముంపు గ్రామాల జాబితాలో మండలంలోని రేఖపల్లి గ్రామాన్ని వెంటనే చేర్చి ప్యాకేజీ పునరావాసం ఇవ్వాలని సిపిఎం మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం  విఆర్ పురం మండల కేంద్రము రేకపల్లి గ్రామశాఖ సమావేశం. సిరపూ తాతబాబురెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనేమ్. సత్యనారాయణ మండల కార్యదర్శి సోయం. చిన్నబాబు మాట్లాడుతూ రేకపల్లి గ్రామాన్ని మొదటి కాంటూర్ లో చేర్చి పునరవాసం ప్యాకేజీ ఇవ్వాలని  ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రేఖపల్లి గ్రామాన్ని ముంపు జాబితాలో చేర్చాలని అన్నారు. ప్రభుత్వం. తక్షణమే  మొదటి కాంటూర్లో ఆ గ్రామాన్ని చేర్చి ఆ గ్రామానికి పునరావాసం కల్పించాలని అదేవిధంగా రేఖ పల్లి గ్రామానికి సంబంధించి ముంపు గ్రామంలో చేర్చకుంటే రానున్న కాలంలో ఐటీడీఏ చింతూరు ముట్టడిస్తామని వారందరినీ ఐక్యం చేసి సిపిఎం ఆధ్వర్యంలో ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సిపిఎం నాయకులు గూటాల శ్రీనివాసరావు వేటి. లక్ష్మి ప్రకాష్ రావు. సుబ్బారావు. వీర్ల. నాగేశ్వరావు చక్రపాణి శాఖ సభ్యులు పాల్గొన్నారు.