ప్రజాశక్తి-చోడవరం : చోడవరం రోడ్డులో వెంకన్నపాలెం శిధిలమై ప్రమాదకరంగా ఉన్న కల్వర్టు వెంటనే పునర్నిమించాలని, రక్షణ గోడలు నిర్మించాలని సిపిఎం చోడవరం మండల కమిటీ ఆధ్వర్యంలో వెంకన్నపాలెం కల్వర్టు వద్ద ఈరోజు రాస్తా రోకో, నిరసన చేయడం జరిగింది. సీపీఎం నాయకులు కల్వర్టుకి ఇరువైపుల రక్షణ గోడలు లేకపోవడంతో ఎరుపు రంగు చీరలను కట్టారు. ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అనంతరం ఈ కార్యక్రమం ఉద్దేశించి సిపీఎం జిల్లా కమిటీ సభ్యులు వివి శ్రీనివాసరావు మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన కల్వర్టులను, రోడ్డులను బాగుచేయలేని పరిస్థితులల్లో ప్రభుత్వం, అధికారులు, స్థానిక ఎం ఎల్ ఏ ఉన్నారన్నారు. సంవత్సరాల తరబడి ఎన్నో సార్లు విన్నవించినా కనీసం పట్టించుకోలేదని, అన్నీ అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకున్నామన్న ఊదర కొడుతున్న కనీసం రోడ్లు, కల్వర్టు నిర్మించలేక పోతున్నారన్నారు. సిపిఎం ఇప్పటికే అనేకసార్లు ఆందోళనలు నిర్వహించిందన్నారు. ఆర్&బి అధికారులకు, కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వం గాని, ప్రజా ప్రతినిధులు కానీ కనీసం పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ప్రజల ప్రాణాలతో చెలగాటమాదడమే అన్నారు. ఈ రోడ్డు అనకాపల్లి, పాడేరు, విశాఖ జిల్లాలకు ప్రధాన రహదారిగా వున్నది. రోజూ వేలాది మంది ప్రయాణించే ప్రధాన రోడ్డు. రోజూ అనేక మంది వాహన దారులు ప్రమాదాలకు గురౌతున్నారు. సుమారు ఏడాది కాలంలో కల్వర్టులు రక్షణ గోడలు పడిపోయిన, బ్రిడ్జి కూలిపోయే స్థితిలో ఉన్నా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తున్న పట్టించుకోకుండా వున్నారు. గడప గడప కు సమస్యలు తెలుసుకుంటున్నామని చెబుతున్న అధికార పార్టీ నాయకులు కల్వర్టులు నిర్మించాలని సంవత్సర కాలంగా పోరాడుతున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం అన్యాయం అన్నారు. ప్రధాన రహదారిలో ఈ కల్వర్టులు చాలా ఇరుకుగా ఉండడం కూడా నిత్యం ప్రమాదాలకు, ట్రాఫిక్ జాములకు కారణంగా వున్నది. నిత్యం భారీ వాహనాలు, 3 జిల్లాల బస్సులు, చెరుకు క్రషర్ సీజన్లో చెరుకు లోడు వాహనాలకు ఈ రోడ్లే ఆధారం. ఈ కల్వర్టులను విస్తరించడం కూడా చాలా అవసరం. ప్రజలు, ప్రయాణీకుల ప్రాణాలకు ఏదైనా హాని జరక ముందే స్పందించి కల్వర్టులను పునర్నిమించాలని కోరుతున్నాం. లేనట్లయితే భవిష్యత్తు మా ఉద్యమాలు తీవ్రతరం తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి.వి. శ్రీనివాసరావు, మండల నాయకులు ఎస్ వి నాయుడు, జోగా రాము, ఐత కోటి, గండి శ్రీను, జి హరి , పి సత్తిబాబు రాజు, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.










