ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గాయపడి విశాఖ కెజిహెచ్ లో చికిత్స పొందుతున్న నలుగురిలో ఇద్దరిని బుధవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామానికి చెందిన మెహిదా వరలక్ష్మి, నరసన్నపేట మండలం సడగాం గ్రామానికి చెందిన గొట్టకమలమ్మను డిశ్చార్జ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. మిగిలిన ఇద్దరి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉందని త్వరలోనే వారిని కూడా డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.










