అమరావతి : ఎపిలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 6 లక్షలను దాటింది. గడిచిన 24 గంటల్లో 8,072మంది కరోనా బారిన పడ్డారు. అలాగే 72 మంది మరణించడంతో .. మొత్తం మృతుల సంఖ్య 5,177కి చేరింది. కాగా, రాష్ట్రంలో 88,197 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 10,712 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 6,01,462కి చేరగా, మొత్తం 5,08,088 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా చిత్తూరులో 12 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రకాశంలో 10మంది, కడప, గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలో ఆరుగురు చొప్పున, తూర్పు గోదావరి, కృష్ణాజిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. అదేవిధంగా అనంతపురం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురు, శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు చొప్పున మృత్యువాతపడ్డారు.










