Jun 20,2022 20:06

న్యూఢిల్లీ :  కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం ఆస్పత్రి నుండి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ రోజు సాయంత్రం ఆస్పత్రి నుండి సోనియా డిశ్చార్జ్‌ అయినట్లు కాంగ్రెస్‌ ఎంపి జైరామ్‌ రమేష్‌ ట్వీటర్‌లో తెలిపారు. వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నారని అన్నారు. పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలతో పాటు దిగువ శ్వాసనాళంలో ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌తో ఈ నెల 12న ఆమె ఢిల్లీలోని శ్రీ గంగారామ్‌ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నేషనల్‌ హెరాల్డ్‌కి చెందిన మనీ లాండరింగ్‌ కేసులో ఈ నెల 23న విచారణకు హాజరుకావాల్సిందిగా ఇడి సమన్లు జారీ చేసింది. ఇప్పటికే రాహుల్‌ గాంధీ ఇడి విచారణను ఎదుర్కొంటున్నారు.