Aug 25,2023 13:00

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండల పరిధిలోని కందికాపుల సచివాలయాలను శుక్రవారం ఎంపీడీవో యోగానంద రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందుగా ఆధార్‌ క్యాంప్‌ పరిశీలించి అనంతరం అటెండ్‌ రిజిస్టర్‌ పరిశీలించారు. సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ ... వైఎస్సార్‌ బీమా, జగనన్నకు చెబుదాం స్పందన లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సచివాలయం సిబ్బందికి సూచించారు. డ్రాప్‌అవుట్‌ పిల్లలను గుర్తించి వారిని స్కూల్లోకి చేర్పించే విధంగా కృషి చేయాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, నిర్లక్ష్యం చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.