Jan 27,2023 11:27

ప్రజాశక్తి - ఆలమూరు (అంబేద్కర్‌ కోనసీమ) : 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మండలంలోని విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకుగాను ఎంపీడీవో కే.జాన్‌ లింకన్‌ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. శుక్రవారం అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, అమలాపురం ఎంపీ చింతా అనురాధల చేతుల మీదుగా ఎంపీడీవో కే.జాన్‌ లింకన్‌ ఉత్తమ సేవా పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.