Jun 21,2023 13:01

ప్రజాశక్తి-ఏలేశ్వరం (కాకినాడ) : ఏలేశ్వరం నూతన ఎంపీడీవో గా ఎం.ప్రేమ్‌ సాగర్‌ బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల నుండి పదోన్నతిపై ఏలేశ్వరం ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన ప్రేమ్‌ సాగరకు మండలంలోని గ్రామ కార్యదర్శులు, సిబ్బంది స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో పిఓపిఆర్డి కెవి సూర్యనారాయణ, కార్యదర్శులు ఎన్‌ వి ఆర్‌ ఆర్‌ వర్మ, వి ఎల్‌ ఎన్‌ రాజన్‌ రాజ్‌, మంజు భార్గవి మోహన్‌ కుమార్‌ బాబు, ఐ అశ్విని, సిబ్బంది కిరణ్‌, సురేష్‌, తదితరులున్నారు.