ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల కేంద్రంలో పనిచేస్తున్న ఎంపిడిఒ బదిలీ కావడం వలన కొత్తగా ఎంపిడిఒ విజరు ప్రసాద్ నియమితులయ్యారు. సోమవారం ఎంపిడిఒ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. కొత్త ఎంపిడిఒ మాట్లాడుతూ ... మండలంలో ఎలాంటి సమస్యలు తన దఅష్టికి వచ్చినా ఏ సమస్య వచ్చినా వాటిని వెంటనే పరిష్కారం చేస్తానని తెలిపారు.










