ప్రజాశక్తి -తిరుమల : అక్టోబర్ 29న తెల్లవారుజామున 1:05 నుంచి 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబర్ 28 రాత్రి 7.05 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టిటిడి అధికారులు పేర్కొన్నారు. తిరిగి 29 తెల్లవారుజామున 3:15 గంటలకు ఏకాంత శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరవనున్నారు. చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఈ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాన్ని 28న రద్దు చేసినట్లు పేర్కొన్నారు.










