Jun 09,2023 12:20

ప్రజాశక్తి-రైల్వేకోడూరు (అన్నమయ్య) : ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్‌ ద్వారా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలోని పలు ఆలయాలకు ఫౌండేషన్‌ అధినేత ముక్కా రూపానందరెడ్డి ముక్కావారి పల్లెలోని క్యాంపు కార్యాలయంలో నాలుగు లక్షల రూపాయలు విరాళం చెక్కుల ద్వారా శుక్రవారం అందజేశారు. రైల్వే కోడూరు రాజంపేట పుల్లంపేట మండలాల్లోని రామాలయాలకు రైల్వేకోడూరు మండలంలోని సాయిబాబా ఆలయానికి ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్‌ ద్వారా నగదును అందజేశారు. గతంలోనూ ఫౌండేషన్‌ ద్వారా కోడూరు నియోజకవర్గంలోని పలు ఆలయాలకు ఆయన విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు ముక్కా మధుసూధన్‌ రెడ్డి, పామూరు రామిరెడ్డి, బత్తిన వేణుగోపాల్‌ రెడ్డి, ముక్కావారిపల్లి సర్పంచ్‌ అరవ శ్రీధర్‌, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.