ప్రజాశక్తి-లేపాక్షి (శ్రీ సత్యసాయి) : జిల్లాలోని లేపాక్షి మండలం లేపాక్షి గ్రామంలో గల శ్రీ వీరభద్ర స్వామి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమంలో మంగళవారం జరిగింది. 68 రోజులకు రూ.123459 ఆదాయం వచ్చినట్లు హుండీ పర్యవేక్షణ అధికారి ఇన్స్పెక్టర్ బి.నరసింహారాజులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంహెచ్ నరసింహమూర్తి తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎల్.రామచంద్రరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.










