తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం నేరుగా కంపార్ట్‌మెంట్‌లోకి కాకుండా నేరుగా క్యూలైన్ల ద్వారా యాత్రికులకు పంపిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. టోకెన్లు లేని యాత్రికులకు ఆరు నుంచి 8 గంటల్లో దర్శనం కలుగుతుందని వివరించారు. బుధవారం స్వామివారిని 63,535 మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకోగా 24,349 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.96 కోట్లు వచ్చిందని తెలిపారు.
మహారాష్ట్ర కు చెందిన సునీత లఖన్ కుమార్ అగర్వాల్ గురువారం ఎస్వీబీసీ ట్రస్ట్ కు రూ 11 లక్షలు విరాళం అందించారు. ఎస్వీబీసీ కార్యాలయంలో చైర్మన్ సాయికఅష్ణ యాచెంద్ర, సీఈవో షణ్ముఖ్ కుమార్ కు దాత ప్రతినిధులు రాఘవేంద్ర, బాలసుదర్శన్ రెడ్డి ఈ మేరకు డీడీని అందజేశారు.










