- ఎన్‌టిఆర్, బాపట్ల జిల్లాల్లో కొనసాగిన జాతాలు
ప్రజాశక్తి - యంత్రాంగం : మున్సిపల్ పారిశుధ్య, ఇంజనీరింగ్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాతాలు బుధవారం 9వ రోజుకు చేరాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమైన జాతా ఎన్‌టిఆర్ జిల్లాలోకి, సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి బయలు దేరిన జాతా ప్రకాశం మీదుగా బాపట్ల జిల్లాలోకి ప్రవేశించింది. ఎన్‌టిఆర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేసి ఇఎస్‌ఐ కార్డ్ ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల హెల్త్ అలవెన్స్‌లు, సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తక్షణమే అమలు చేయాలని కోరారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నూకరాజు, రాష్ట్ర నాయకులు లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం, బాపట్ల జిల్లాలో ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎందరు పాలకులు మారిన మున్సిపల్ కార్మికుల జీవితాలు మారడం లేదన్నారు. మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక ఓ ఒక్క హామీనీ నెరవేర్చలేదని అన్నారు. తక్షణమే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎపి ఎఫ్‌ఆర్‌ఎస్, ఇకెవైసి తదితర పేర్లతో కార్మికులను వేధింపులకు గురి చేయడం తగదన్నారు ఆయా మున్సిపాల్టీల్లో జాతాకు ఘన స్వాగతం లభించి










