మాంచెస్టర్ వేదికగా జులై 19 నుంచి ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తుది జట్టును ప్రకటించింది. నాలుగో టెస్ట్ కోసం ఈసీబీ ఓ మార్పు చేసింది. ఓలీ రాబిన్సన్ స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగనుంది. మరోవైపు ఆస్ట్రేలియా తమ తుది జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. మూడో టెస్ట్ సందర్భంగా రాబిన్సన్ స్వల్పంగా గాయపడ్డాడు. అతను రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కూడా చేయలేదు.
నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ డకెట్, జాక్ క్రాలే,మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్
One change for the 4th @LV_Cricket #Ashes Test at @EmiratesOT 🏟🏏
— England Cricket (@englandcricket) July 17, 2023










