Jul 26,2023 21:53

ఓవల్‌: యాషెస్‌ సిరీస్‌ ఐదో, చివరి టెస్ట్‌ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లండ్‌ జట్టు నాల్గో టెస్ట్‌లో గెలుపుకు చేరువలో ఉన్న దశలో వర్షం కారణంగా చివరిరోజు ఆట రద్దు కావడంతో ఆ జట్టుకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఐదు టెస్ట్‌ల యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 2-1 ఆధిక్యతలో ఉండగా.. ఐదో, చివరి టెస్ట్‌ ఓవల్‌లో జరగనుంది. దీంతో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్‌ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చివరి టెస్ట్‌కూ మార్పుల్లేకుండానే బరిలోకి దిగనున్నట్లు తెలిపాడు.
ఇంగ్లండ్‌ జట్టు: బెన్‌ స్టోక్స్‌(కెప్టెన్‌), క్రాలే, డకెట్‌, మొయిన్‌ అలీ, జో రూట్‌, హారీ బ్రూక్‌, జానీ బెయిర్‌స్టో, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ ఆండర్సన్‌.