Jul 30,2023 11:45

ఓవల్‌ : వెటరన్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌, అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం ఓవల్‌లో జరుగుతున్న మ్యాచే తనకు చివరి టెస్టు అని 37 ఏళ్ల బ్రాడ్‌ వెల్లడించాడు. 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో యాషెస్‌లో చివరి టెస్టుకు ముందు 166 టెస్టుల్లో 27.68 సగటుతో 600 వికెట్లు తీసిన బ్రాడ్‌, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. 2016లో చివరి వన్డే ఆడిన బ్రాడ్‌ అప్పటినుంచి ఒక్క టెస్టులకే పరిమితమయ్యాడు. ఓవరాల్‌గా స్టువర్ట్‌ బ్రాడ్‌ 167 టెస్టుల్లో 3656 పరుగులు.. 602 వికెట్లు, 121 వన్డేల్లో 529 పరుగులు.. 178 వికెట్లు, 56 టి20ల్లో 118 పరుగులు.. 65 వికెట్లు పడగొట్టాడు. ఇక 2014లో జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో బ్రాడ్‌ ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.