భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ ప్లాజా వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ.. సద్దుల బతుకమ్మ, దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లే వాహనాలతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఒక్కో వాహనాన్ని సుమారు అరగంట పాటు తనిఖీ కోసం నిలిపివేస్తుండడంతో వాహనదారులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. డీసీపీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో వాహనాల్లో డబ్బు, మద్యం అక్రమంగా తలించకుండా.. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.










