Mar 30,2023 15:01

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ లో శ్రీరాముని శోభాయత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీతారామ్‌ బాగ్‌ ఆలయం నుండి సుల్తాన్‌ బజార్‌ హనుమాన్‌ వ్యాయామశాల వరకు ఈ శోబాయాత్ర సాగనుంది. మధ్యాహ్నం 1 గంటలకు ఈ శోభాయాత్ర ప్రారంభం అయింది. సీసీ కెమెరా పోలీస్‌ నిఘా నీడలో 6 కిలో మీటర్ల మేర ఈ శోభాయత్ర సాగనుంది. దూల్‌ పెట్‌ సీతారాంబాగ్‌ ఆలయం నుండి శోభాయత్ర ప్రారంభమై అక్కడి నుండి బోయగూడ కమాన్‌, మంగళ్‌ హాట్‌ జాలి హనుమాన్‌, దూల్‌ పేట, పురానాపూల్‌, జుమేరాత్‌ బజార్‌, చుడిబజార్‌, బేగంబజార్‌ చత్రి, బర్తన్‌ బజార్‌, సిద్ధంబర్‌ బజార్‌ మసీదు, శంకర్‌ షేర్‌ కోటల్‌, గౌలిగూడ కమాన్‌, గురుద్వారా, పుల్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్‌ మీదుగా సుల్తాన్‌ బజార్‌ లోని హనుమాన్‌ వ్యాయామశాలకు ఈ శోభాయాత్ర చేరుకుంటుంది. పోలీసులు శ్రీ రాముని శోభాయత్ర రూట్‌ మ్యాప్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు, పలు మల్లింపులు చేపట్టారు.