- విజయవాడ దుర్గ గుడిలో మంత్రికి కష్టాల ఏకరువు
ప్రజాశక్తి-యంత్రాంగం : కరోనా వ్యాప్తి తగ్గడంతో ఆలయాలకు యాత్రికులు పోటెత్తుతున్నారు. తిరుమలతో పాటు, విజయవాడ కనకదుర్గ గుడులు యాత్రికులతో కిటికిటలాడాయి. రెండు సంవత్సరాల తరువాత భక్తుల మధ్య బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటం తమిళులు పవిత్రంగా భావించే పెరటాసి మాసంతో పాటు వారంతంలో గరుడసేవ రావడంతో తిరుమల కిటకిటలాడుతోంది. రాత్రి ఏడు గంటలకుగరుడసేవ ప్రారంభం కానుండగా, మధ్యాహాునికే తిరుమలలో ఇసుకవేస్తే రాలనంతగా జనం చేరుకున్నారు. ఆ సమయానికే దాదాపుగా రెండు లక్షల మందికిపైగా భక్తులు తిరుమలలో ఉనాురు.నాలుగు మాడవీధుల గ్యాలరీలు నిండిపోయాయి. పార్కింగ్ స్థలాలనీు వాహనాలతో నిండిపోయాయి. దీంతో మధ్యాహాుం నుండి తిరుమలకు ప్రైవేటు వాహనాలను నిలిపివేశారు. అలిపిరి వద్ద వాహనాలను అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, టిటిడి అధికారులు ప్రైవేటు వాహనాలకు తిరుపతిలో ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. ఆర్‌టిసి బస్సులలో మాత్రమే యాత్రికులు తిరుమలకురావాలనివిజ్ఞప్తి చేశారు. గరుడోత్సవానికి దాదాపుగా 4.50 లక్షల మంది యాత్రికులు వచ్చే అవకాశముందనిఅంచనా వేస్తునుట్లు అధికారులు తెలిపారు. దీనికి తగ్గట్టుగా మాడవీధుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. గరుడోత్సవ దర్శనానికి వచ్చే వారినిక్యూలైన్లలో పంపనునాురు. ఈ విధానానిు టిటిడి ఈ సంవత్సరమే ప్రారంభించింది. మాడవీధులతోపాటు, గ్యాలరీలలో ఉను యాత్రికులతో టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడి, ఇఓ ఎవి ధర్మారెడ్డి మాట్లాడారు. వసతుల గురించి మాట్లాడారు.
- విజయవాడలో...
విజయవాడ కనకదుర్గ గుడిలో ప్రోటోకాల్ దర్శనాలు పెరగడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 500 రూపాయల టిక్కెట్ కొను వారు సైతం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సివచ్చింది. అదే సమయంలో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ రావడంతో ఆయనకు తమ ఇబ్బందులు ఏకరువుపెట్టారు. ఒక దశలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు విఐపి క్యూలైన్లకు తాళం వేశారు.
- నేడు దుర్గమ్మకు సిఎం పట్టువస్త్రాల సమర్పణ
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మకు ఆదివారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చే దుర్గమ్మను ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు దర్శించుకుంటారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.










