Nov 06,2023 14:37

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి పండుగ సెలవును ఈ నెల 13వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 13న సాధారణ సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కేఎస్‌ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం సాధారణ సెలవులు, ఆప్షనల్‌ సెలవుల జాబితాలో స్వల్ప మార్పులు చేశారు. దీంతో ఈ నెల 13వ తేదీన (సోమవారం) ఆప్షనల్‌ హాలిడే బదులుగా సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం ఈ నెల 12న (ఆదివారం) దీపావళి సెలవుగా ఉంది.