- అన్ని శాఖలకు జిఎడి తాజా సర్క్యులర్
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి:ప్రతినెలా గవర్నరుకు సమర్పించాల్సిన నివేదికలో అతి ముఖ్యమైన పథకాల వివరణివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. రాష్ట్ర పాలనకు సంబంధిరచి దాదాపు 15 అంశాలపై వివరాలు ఇవ్వాలని గవర్నర్ పేషీ నుంచి సర్క్యులర్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతినెలా 3వ తేదీ నాటికి ఈ వివరాలు ఇవ్వాలని గవర్నర్ పేషీ హుకుం జారీ చేయగా, శాఖల నురచి ప్రతినెలా 24వ తేదీకి వివరాలు అందజేయాలంటూ అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ ఏప్రిల్ 2న సర్క్యులర్‌ను పంపింది. అయితే ఈ నెల ఇప్పటివరకు చాలా శాఖల నురచి వివరాలు రాలేదని సమాచారం.
ఇదే సమయంలో తాజాగా సాధారణ పరిపాల శాఖ నురచి అన్ని శాఖలకు వెళ్లిన మరో సర్క్యులర్‌లో ఆయా శాఖలకు సంబదించి అతి ముఖ్యమైన వివరాలు సమర్పిరచాలంటూ పేర్కొన్నారు. గవర్నర్ పేషీ నురచి 15 రంగాల వివరాలతోపాటు, ఆర్థిక పరమైన మరికొన్ని అంశాలు కూడా కావాలని కోరగా, ప్రభుత్వం మాత్రం కొన్ని అరశాలపైనే స్పరదిస్తున్నట్లు తెలిసిరది. 'మీ శాఖల్లో అమలు చేస్తున్న వాటిలో అతి ముఖ్యమైన కార్యక్రమాల వివరాలు గుర్తిరచి ఇవ్వండి' అరటూ జిఎడి సర్క్యులర్‌లో పేర్కొంది. అలాగే ఇంకా అనేక శాఖలు స్పందించడం లేదని కూడా ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం.










