వీరఘట్టం (మన్యం) : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం నిలిపివేయాలని కోరుతూ ... ఆదివారం వీరఘట్టం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ ... విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను అమ్మేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలుగు ప్రజలు పోరాడి 32 మంది ప్రాణత్యాగాలతో, 16 వేల మంది రైతుల 22 వేల ఎకరాల భూత్యాగ ఫలంతో లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్న ప్లాంట్ ను రక్షించుకుని తీరతామని స్టీల్ ప్లాంట్ కార్మికులు, ప్రజలు గత 1000 రోజులకు పైగా పోరాడుతున్నారని తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలిపేయాలని డిమాండ్ చేశారు.










