వన్డే క్రికెట్ కు గతేడాది జులైలో స్టోక్స్ గుడ్‌బై చెప్పిన బెన్ స్టోక్స్ యూ టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్‌కు అందుబాటులో ఉండాలంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ అభ్యర్థన మేరకు స్టోక్స్ వన్డే వరల్డ్ కప్ 2023లో పాలు పంచుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.కాగా వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్, అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా గత వన్డే వరల్డ్ కప్ ఫైనలిస్ట్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. ప్రస్తుతం బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా సేవలు అందిస్తున్నాడు. ప్రపంచకప్ 2023లో బెన్ స్టోక్స్ పాల్గొంటే ఇంగ్లండ్ జట్టుకు మరింత బలం చేకూరినట్టు అవుతుంది.










