Nov 28,2022 20:13

పాకిస్తాన్‌ : డిసెంబర్‌ 1 నుంచి ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య పాకిస్థాన్‌లో మూడు టెస్టుల సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌ కోసం ఇప్పటికే ఇంగ్లండ్‌ జట్టు పాకిస్థాన్‌ చేరుకుని ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంటోంది. టెస్టు సిరీస్‌ ముందే బెన్‌ స్టోక్స్‌ పాకిస్థాన్‌ ప్రజల మనసు దోచుకున్నాడు. ఈ టెస్ట్‌ సిరీస్‌ ద్వారా వచ్చే తన మ్యాచ్‌ ఫీజును మొత్తం పాకిస్తాన్‌లో ఈ ఏడాది వరద బాధితులకు అందజేయనున్నట్లు బెన్‌ స్టోక్స్‌ ప్రకటించాడు. వరదల కారణంగా దెబ్బతిన్న నగరాల పునర్‌ నిర్మాణం కోసం ఈ డబ్బును వాడుకోవాలని అతడు ట్వీట్‌ చేశాడు. కాగా ఈ మూడు టెస్టుల సిరీస్‌ ద్వారా అతడు సుమారు రూ.37 లక్షల నగదును అందుకోనున్నాడు. ఈ మొత్తాన్ని పాకిస్థాన్‌ ప్రజలకు స్టోక్స్‌ విరాళంగా ఇవ్వనున్నాడు. డిసెంబర్‌ 1 నుంచి రావల్పిండిలో తొలి టెస్ట్‌, డిసెంబర్‌ 9 నుంచి ముల్తాన్‌లో రెండో టెస్టు, డిసెంబర్‌ 17 నుంచి కరాచీలో మూడో టెస్ట్‌ జరగనుంది.