Jul 18,2022 21:38

నేడు దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ తర్వాత గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటన
లండన్‌:
ఇంగ్లండ్‌ వన్డేజట్టు మాజీ కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ క్రికెట్‌ అభిమానులకు షాక్‌ న్యూస్‌. మంగళవారం డర్హమ్‌ వేదికగా దక్షిణాప్రికాతో జరిగే వన్డే మ్యాచ్‌ అనంతరం ఆ ఫార్మాట్‌నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించాడు. సోమవారం ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. 'నా చివరి వన్డే మ్యాచ్‌ దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగే వన్డేనే. ఆ మ్యాచ్‌ అనంతరం ఈ ఫార్మాట్‌ నుంచి వైదొలని అనుకుంటున్నా.. ఇది కఠినమైన నిర్ణయమే.. అయినా జట్టు ప్రయోజనాల రీత్యా అదే ఉత్తమమని భావిస్తున్నా.. ఇంగ్లండ్‌ తరఫున ఆడడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా, నేను ఆరాధించే క్రీడల్లో క్రికెట్‌ ఒకటి. క్రికెట్‌లో చివరి నిమిషం వరకు పూర్తి సామర్థంతో రాణించేందు చూస్తా..! అని బెన్‌ స్టోక్స్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. కాగా, ఇంగ్లండ్‌జట్టు 2019 వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో బెన్‌ స్టోక్స్‌ కీలక పాత్ర పోషించాడు. తాజాగా టీమిండియాతో ఆడిన వన్డే సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయాడు.