రూ.1.30 లక్షల నగదు స్వాధీనం
ప్రజాశక్తి- ఇచ్ఛాపురం :శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని పురుషోత్తపురం మోటార్ వెహికల్ చెక్‌పోస్టుపై బుధవారం అర్ధరాత్రి ఎసిబి అధికారులు దాడులు చేశారు. చెక్‌పోస్టులోని రవాణా శాఖ కౌంటరులో రికార్డులను తనిఖీ చేశారు. సహాయ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అనీల్ కుమార్, ఇద్దరు కానిస్టేబుళ్ల వద్ద రూ.1.30 లక్షల అనధికార సొమ్మును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎసిబి డిఎస్‌పి రమణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ చెక్‌పోస్టులో అవినీతి జరుగుతుందని ఫిర్యాదులు రావడంతో దాడులు చేపట్టామని తెలిపారు. రూ.1.30 లక్షల అనధికార నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.










