Nov 21,2020 23:13

మాట్లాడుతున్న శాస్త్రవేత్తలు

ప్రజాశక్తి - కడియం 'మండలంలోని దుళ్ల, వీరవరం గ్రామాల్లో కొబ్బరి తోటల్లో, మొక్కల్లో ఆశించు సర్సిలాకార తెల్లదోమ నివారణపై అంబాజీపేట డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన పరిశోధనా కేంద్రం (అంబాజీపేట), ఉద్యాన శాఖ సంయుక్తంగా రైతులకు శనివారం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.' ఈసందర్భంగా ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బివికె.భగవాన్‌, ఎన్‌బివి.చలపతి మాట్లాడుతూ కొబ్బరి తోటల్లో సర్సిలాకార తెల్లదోమ, బొండార్స్‌ నెస్‌టింగ్‌ తెల్లదోమను గుర్తించామన్నారు. చలికాలంలో దీని తీవ్రత పెరిగే అవకాశమున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉద్యానశాఖ అధికారి డి.సుధీర్‌కుమార్‌ మాట్లాడుతూ ఇసోరియా ప్యూ మోజరోజియా ద్రావణాన్ని గ్రామీణ వ్యవసాయ, ఉద్యానశాఖ సహాయకులను సంప్రదించి పొందగలరని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎఇఒ శశికళ పాల్గొన్నారు.