ప్రజాశక్తి-అంబాజీపేట 'సర్పిలాకార తెల్లదోమ నియంత్రించేందుకు ఐసేరియా హ్యూమసోరిసియా అనే శిలీంధ్ర జీవ నియంత్రణ పద్ధతి ద్వారా నివారించొచ్చని ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ ఎన్‌బివికె.చలపతి అన్నారు.' అంబాజీపేట డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన పరిశోధన కేంద్రంలో అమలాపురం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గ అభ్యుదయ రైతులకు, గ్రామ ఉద్యాన సహాయకులకు రూగోస్ తెల్లదోమ నివారణ చర్యలపై బుధవారం అవగాహన కల్పించారు. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ చలపతిరావు మాట్లాడుతూ కొబ్బరి చెట్టలకు డైకోర్టైసా సూడోమల్లాడ గుడ్లను చెట్ల ఆకులకు క్లిపింగ్ చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా వివరించారు. ప్లాంట్ ఫెథాలజీ టెక్నికల్ అసిస్టెంట్ వై.రామకృష్ణ, అమలాపురం ఉద్యాన సహాయ సంచాలకులు ఎన్.మల్లికార్జునరావు మాట్లాడారు. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల గ్రామ ఉద్యాన సహాయకులు పాల్గొన్నారు.










