గుంతకల్లు(అనంతపురం): గుంతకల్లు మండల పరిధిలోని వై.టి.చెరువు గ్రామ సర్పంచ్ స్థానానికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దాసరి సోనియా శనివారం వైసిపి తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఈమె బిటెక్ పూర్తి చేసి బి.బెంగళూరులోని ఐబిఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం జగన్‌ను ఆదర్శంగా తీసుకొని ఊరి అభివఅద్ధి కోసం సర్పంచ్ స్థానానికి పోటీలో ఉన్నట్లు ఆమె మీడియాకు తెలిపారు.










