బెంగళూరు : కలబర్గి (గ్రామీణం) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పాండురంగ్ మావింకర్ బుధవారం తన నామినేషన్ వేశారు. అనంతరం కలబురగిలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్ ధవాలే, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కలబురగి జిల్లా కార్యదర్శి కె నీలా, పార్టీ నాయుకులు చెన్నప్ప అనేగుడి, శ్రీమంత్ బిరందర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సభలో వ్యక్తలంతా రాష్ట్ర, కేంద్రాల్లో బిజెపి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల, అవినీతి, మతతత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ స్థానం నుంచి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.










