కొడంగల్: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడికి లక్ష 20వేల మెజారిటీ వచ్చిందని, కొడంగల్‌లో అంతకంటే ఎక్కువ మెజారిటీతో తనను గెలిపించాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. కొడంగల్‌లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందన్నారు. ''కొడంగల్‌లో గతంలో బిఆర్‌ఎస్‌ను గెలిపించినా అభివఅద్ధి జరగలేదు. కొడంగల్‌లో పోటీ చేయాలని కేసీఆర్, కేటీఆర్‌కు సవాల్ విసిరాను. నాకు ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. నాకోసం కాదు.. మీకోసమే. ఈ ఐదేళ్లలో కొడంగల్ నియోజకవర్గానికి ఏమైనా అభివఅద్ధి జరిగిందా?కొడంగల్ ప్రజలను మోసం చేసిన బిఆర్‌ఎస్ మళ్లీ ఎలా ఓట్లు అడుగుతుంది. కొడంగల్ యువతకు ఉద్యోగాలు అందించేందుకు జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలు. ఈ ఎన్నికలు మన భవిష్యత్‌ను తీర్చిదిద్దుతాయి'' అని రేవంత్ అన్నారు.










