ఆలమూరు (తూర్పు గోదావరి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ కంటి వెలుగు పథకం పేదలకు వరం లాంటిదని కార్యదర్శి కె.మోక్షాంజలి పేర్కొన్నారు. ఆలమూరు మండలంలోని మడికి సబ్ సెంటర్‌లో మంగళవారం వైఎస్సార్ కంటి వెలుగు పథకం వైద్య శిబిరాన్ని మోక్షాంజలి ప్రారంభించారు. ముందుగా వృద్ధులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.










