ప్రజాశక్తి - ఆలమూరు : ప్రభుత్వం ఐఎఫ్పి సాంకేతిక పద్ధతిని ప్రవేశపెట్టి సుద్దముక్క లేని బోధనకు శ్రీకారం చుట్టిందని మండల వైసిపి కన్వీనర్, సర్పంచ్ తమ్మన శ్రీనివాసు అన్నారు. మండల పరిధి చెముడులంక ఎస్టిఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించి, అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఐఎఫ్పి తరగతి గదులను ప్రారంభించారు. పాఠశాలకు మొత్తం 16 ఐ ఎఫ్ పి పరికరాలు మంజూరవగా 14 పరికరాలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిజిటిలైజేషన్ విధానంలో అత్యున్నత విద్యా విధానాన్ని విద్యార్థుల కోసం అమలు చేస్తుందన్నారు. తల్లి తండ్రులు పిల్లల చదువుల విషయంలో తగినజాగ్రత్తలు తీసుకుని తప్పకుండా పాఠశాలకు పంపే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపక నేత తిర్నాతి శ్రీనివాసు, మాజీ సర్పంచులు నాగిరెడ్డి సత్యనారాయణ, బి.వీర వెంకట్రావు, నాయకులు దొండపాటి చంటి, దొండపాటి శ్రీను, మోటూరి సురేష్, సుంకర శ్రీనివాసు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శివరామ కుమార్, జిఎస్ చక్రవర్తి పాల్గొన్నారు.










