Aug 23,2022 15:46

ప్రజాశక్తి - ఆలమూరు :ఈనెల 31 నుండి జరుగనున్న వినాయక చవితి వేడుకలకు మండల పరిధిలోని18 గ్రామాల్లో వినాయక పందిళ్ళు, మండపాలు ఏర్పాటు చేసుకునే ఉత్సవ నిర్వాహకులు తప్పని సరిగా ముందస్తు పోలీసు అనుమతి పొందాలని ఎస్సై ఎస్‌.శివప్రసాద్‌ అన్నారు. పోలీస్‌ స్టేషన్లోని కంట్రోల్‌ కౌంటర్‌ నందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్‌ సేవా కేంద్రంలో దరఖాస్తులు కమిటీలు వివరాలతో అందజేయాలన్నారు. ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు కేంద్రం పనిచేస్తుందన్నారు. నిబంధనలతో పాటుగా సామాజిక దూరం పాటించేలా కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని ఎస్సై అన్నారు.