కలెక్టరేట్ : బలహీనవర్గాలకు రుణాలు మంజూరుచేయాలని కోరుతూ టిడిపి ఆధ్వర్యాన శుక్రవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా టిడిపి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి సనపల పాండురంగారావు వట్లాడుతూ, కుల, మతాల మధ్య చిచ్చు రేపకుండా తెలుగుదేశం ప్రభుత్వం వేలాది మంది బిసిలకు రూ.కోట్లలో సబ్సిడీ రుణాలను అందజేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు, బలహీనవర్గాలు, దళితులు, మైనారిటీలకు రుణాలు మంజూరు చేయకపోవడం దుర్మార్గమన్నారు. వీరికి వృత్తి పరికరాలు, పనిముట్లు, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అన్నింటినీ తుంగలో తొక్కారని ఆరోపించారు. జగన్మోహన్‌రెడ్డి బిసి ద్రోహి అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎల్లపు శ్రీనివాసరావు, నక్కా కనకరాజు, దాసన్న సత్యనారాయణ, లక్ష్మీ పూజ, సత్యవతి, పొడుగుకుమార్, బంటుపిల్లి సూర్యనారాయణ పాల్గొన్నారు.










