Jun 14,2023 21:35

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే బిసిలకు సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాజ్యసభ సభ్యులు ఆర్‌ కృష్ణయ్య తెలిపారు. విజయవాడలో వైసిపి బిసిల సదస్సును బుధవారం నిర్వహించింది. ఈ సదస్సులో ఆర్‌ కృష్ణయ్య, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. జగన్‌ సంక్షేమ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. పార్లమెంటులోనూ వైసిపి ఎంపిలు బిసిల చట్టబద్ధ హక్కుల కోసం కృషి చేస్తున్నారన్నారు. జగన్‌కు బిసిలంతా అండగా నిలవాలని కోరారు.