ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ రైతుగా, న్యాయవాదిగా, రాష్ట్ర ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా, గుత్తి సమితి అధ్యక్షులుగా, కమ్యూనిస్టు నేతగా ఇలా అనేక రంగాల్లో సేవలు అందించిన జడ్ వీరారెడ్డి భావితరాలకు ఆదర్శప్రాయుడని సిపిఎం నగర కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ అన్నారు. జడ్‌వీరారెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం గణేనాయక్ భవన్‌లో నిర్వహించారు. జడ్ వీరారెడ్డి చిత్రపటానికి నాయకలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి మద్దతుగా జిల్లా కేంద్రంలో ట్రాక్టర్, స్కూటర్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సిఐటియు నాయకులు వెంకటనారాయణ, రామాంజనేయులు, లతీఫ్, నూరుల్లా, వలి, ప్రసాద్, ఫయాజ్, వెంకటేష్, జీవరత్నం, గౌస్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
గుత్తి : రైతు సంఘం నాయకుడు కామ్రేడ్ జెడ్.వీరారెడ్డి 14వ వర్థంతిని సిపిఎం ఆధ్వర్యంలో గుత్తిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జెడ్.వీరారెడ్డి కాలనీలో ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ జెడ్.వీరారెడ్డి ప్రజలకు ఎన్నో సేవలు చేశారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వి.నిర్మల, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్, సిఐటియు నాయకులు షేకు, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా నాయకులు మున్నీ తదితరులు పాల్గొన్నారు.
పెద్దవడుగూరు : కామ్రేడ్ వీరారెడ్డి ఆశయాలను కొనసాగించాలని సిపిఎం మండల కార్యదర్శి దస్తగిరి పిలుపునిచ్చారు. వీరారెడ్డి వర్థంతిని పెద్దవడుగూరులో ఆయన సమాధి వద్ద నిర్వహించారు. దస్తగిరి, రైతు సంఘం నాయకులు ఆది, రామాంజనేయులు, వేమన్న తదితరులు పాల్గొని ఆయన సమాధికి పూలమాలవేసి నివాళులర్పించారు.










