ప్రజాశక్తి-కదిరి కాలసముద్రం పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని వైసిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాకే లలితమ్మ పేర్కొన్నారు. శనివారం కాలసముద్రం, నడిమిపల్లి గ్రామాలలో మాజీ సర్పంచ్ ఇంద్రప్రసాద్‌రెడ్డి అధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సముచిత న్యాయం చేస్తానని చెప్పారు. సచివాలయం పాలన ఉన్నందున అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. ప్రతి వీధికి సీసీ రోడ్డు, డ్రైనేజీ కాలువలు, ఇంటింటికీ కొళాయి ఎర్పాటు చేస్తానన్నారు. తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో బాబా ఫకృద్దీన్, జయసింహారెడ్డి, ఈశ్వరరెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.










