Oct 31,2023 13:43

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే కర్నూలు మండలం, రేమట గ్రామంలో ''గడపగడపకు మన ప్రభుత్వం'' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు పూల వర్షంతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్థానిక గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్స్‌ తో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటింటికి వెళ్లి వైసిపి ప్రభుత్వంలో సిఎం జగనన్న వారికి వివిధ పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి చేకూర్చిందీ..ఎంత లబ్ధి చేకూర్చిందన్న వివరాలను వారికి వివరించారు. వారికి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని దానికి సంబంధించిన అధికారితో సమన్వయం చేసుకొని ఆ సమస్యకు పరిష్కారం మార్గాన్ని చూపుతూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వాసు వెంకటేశ్వరమ్మ, జడ్పీటీసీ ప్రసన్న కుమార్‌, సంపత్‌ కుమార్‌, తిరుమల రెడ్డి, బి.సురేష్‌, యం.సురేష్‌, మద్దిలేటి, విద్య సాగర్‌, అబ్రహం వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.