జరుగుమల్లి (ప్రకాశం) : జరుగుమల్లి మండలంలోని నరసింగోలు గ్రామంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. వైసిపి కొండపి నియోజకవర్గ ఇంచార్జి వరి కూటి అశోకబాబు మాట్లాడుతూ ... ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల లబ్ది అందించాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు. అశోకబాబు గ్రామంలోని గడప గడపకు వెళ్లి మూడేళ్ళ కాలంలో ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ది గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నరసింగోలు సర్పంచ్ ఏజెర్ల ఇక్కయ్య, వైసిపి నాయకులు బెల్లం సత్యన్నారాయణ, పల్లా అనురాధ, పాటిబండ్ల వేణు, నల్లమోతు కృష్ణమోహన్, ఈఓపిఆర్డీ పోకూరి అశోకబాబు, పలువురు మండలంలోని అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










