ఢిల్లీ : కేేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని బెదిరిస్తూ ఇవాళ ఉదయం నుంచి రెండు ఫోన్ కాల్స్ వచ్చాయి. నాగ్‌పూర్‌లోని గడ్కరీ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్‌కు 10 నిమిషాల వ్యవధిలోనే (ఉదయం 11:30 నుంచి 11:40 గంటల మధ్య) రెండుసార్లు ఈ విధమైన ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. గడ్కరీని చంపేస్తామని.. కార్యాలయాన్ని పేల్చివేస్తానని కూడా దుండగుడు ఫోన్‌లో బెదిరించాడు. దీంతో నితిన్ గడ్కరీ కార్యాలయ ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నితిన్ గడ్కరీ నివాసానికి, ఆయన కార్యాలయానికి భద్రతను కట్టుదిట్టం చేశారు. కాల్ డేటా ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










