హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలీసు కమాండ్ కంట్రోల్ భవనంలో చోరీ జరిగింది. జూబ్లీహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 30 కాపర్ బండిల్స్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. నిర్మాణ సంస్థ ప్రతినిధి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ ఘటనపై నిర్మాణ సంస్థ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించనున్నారు. హైదరాబాద్‌లోని అణువణువు నిఘా పెట్టేందుకు, ఏక్షణంలో ఎక్కడ ఏం జరిగానా క్షణాల్లో పసిగట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కమాండ్ కంట్రోల్ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.










