Nov 03,2023 15:10

హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్‌ నగరంలో 'పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2015లో నిర్మాణం ప్రారంభించి, 6.42లక్షల చదరపు అడుగుల్లో 20 అంతస్తులతో అత్యాధునిక వసతులతో ఈ టవర్‌ను నిర్మించారు. ఇందుకోసం రూ.585 కోట్లు ఖర్చుచేశారు.ఇక్కడి నుంచి రాష్ట్రంలోని లక్షకుపైగా సీసీ కెమెరాలను వీడియో వాల్‌పై వీక్షించవచ్చు. ప్రకఅతి వైపరీత్యాలు, మరేదైనా విపత్తులు సంభవించినప్పుడు పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌, ఇరిగేషన్‌ అధికారులు, సెక్రటరీలు, మంత్రులు ఇక్కడి నుంచే రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తారు.