ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరి) : బీసీ, ఈబిసి, సంచార జాతుల విద్యార్థులు పీఎం యశస్వి ఉపకార వేతనాల కోసం ఆగస్టు10 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారిణి రాజేశ్వరి సోమవారం తెలిపారు. 9వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులు ఈ ఉపకారవేతనాలు దరఖాస్తు చేసుకోవాలన్నారు, సెప్టెంబర్ 29న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రవేశ పరీక్ష ఉంటుందని మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు, ఎంపికైన తొమ్మిదో తరగతి విద్యార్థులకు సంవత్సరానికి రూ.75 వేలు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు రూ.1.25 లక్షలు కళాశాల, హాస్టల్ ఫీజులకు విడుదల చేయడం జరుగుతుందని బీసీ వెల్ఫేర్ అధికారి రాజేశ్వరి తెలిపారు. మరిన్ని వివరాలకు అందుబాటులో ఉన్న బీసీ వసతి గృహ అధికారిని సంప్రదించాలన్నారు.










