Aug 08,2023 17:04
  •  రెండో రోజు కొనసాగిన నిరసన దీక్ష

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కృష్ణా) : గ్రామ రెవెన్యూ సహాయకులకు దీర్ఘ కాలంగా పెండిగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ ఆధ్వర్యంలో కలక్టరేట్‌ ధర్నా చౌక్‌ చేపట్టిన నిరసన ధర్నా రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు బొడ్డు వెంకట రత్నం, చాట్ల రమేష్‌లు మాట్లాడుతూ.. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని గత టిడిపి ప్రభుత్వంలో పోరాటాలు చేస్తున్న తమకు అప్పుడు ప్రతి పక్షంలో ఉన్న జగన్‌ మోహన్‌ రెడ్డి పోరాటాలకు సంఘీభావం తెలిపి తాను అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని నాలుగున్నర ఏళ్లు గడుస్తున్నా ఒక్క హామీ కూడా నేర వెర్చలేదన్నారు. పైగా టిడిపి ప్రభుత్వంలో ఇచ్చిన అరియర్స్‌లో కోత పెట్టడాని ఇది దుర్మార్గమన్నారు. కాబట్టి ఇచ్చిన హామీ మేరకు సమస్యలన్నీ పరిష్కరించాలని లేదంటే రానున్న రోజుల్లో దశల వారీగా ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణా మాదిరిగా మన రాష్ట్రంలోని విఆర్‌ఎలకు పే స్కేల్‌ అమలు చేయాలని, నామినీలుగా పని చేస్తున్న వారందరినీ విఆర్‌ఎలుగా నియమించాలన్నారు. జి.వో.నెం. 1680 ప్రకారం 65 సంవత్సరాలు పైబడి మరణించిన వి.ఆర్‌.ఎల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, జి.వో. నెం. 13 ప్రకారం ఇంటర్‌ క్వాలిఫికేషన్‌ మీద వి.ఆర్‌.ఎలకు విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (విఆర్డీ)లుగా ప్రమోషన్‌ ఇవ్వాలన్నారు. జిల్లాలో ఉన్న ఖాళీ విఆర్‌ఎ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. సిఐటియు నగర కార్యదర్శి సిహెచ్‌.జయరావులు సంఘీభావం తెలిపారు. ఈ ధర్నాలో వెన్నా వెంకటేశ్వరావు, రాఘవులు, జాన్సీ, అరుణ, జిల్లా నాలుమూలాల నుండి పలువురు విఆర్‌ఏలు పాల్గొన్నారు.