Mar 15,2023 21:10
  •  ఎంఆర్‌పిఎస్‌ జాతీయ ఉపాధ్యక్షులు నరసింగరావు

ప్రజాశక్తి-మార్కాపురం (ప్రకాశం జిల్లా) : పార్లమెంట్‌లో ఎస్‌సి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని.. లేని పక్షంలో మాదిగ గ్రామాల్లో రాజకీయ పార్టీ నాయకులను తిరగనివ్వబోమని ఎంఆర్‌పిఎస్‌ జాతీయ ఉపాధ్యక్షులు జలదంకి నరసింగరావు హెచ్చరించారు. ఎస్‌సి వర్గీకరణ జరిగేంత వరకూ ఉద్యమం ఆగదన్నారు. వర్గీకరణ కోరుతూ చేపట్టిన 'మాదిగల సంగ్రామ పాదయాత్ర' ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో బుధవారం ప్రారంభమై...మార్కాపురానికి చేరుకుంది. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 4న అమరావతి, హైదరాబాద్‌లోని బిజెపి కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. మార్కాపురంలో పాదయాత్ర బృందానికి ఎంఆర్‌పిఎస్‌ సీనియర్‌ నాయకులు కాశీరావు స్వాగతం పలికారు. ఎంఆర్‌పిఎస్‌ ఉమ్మడి ప్రకాశం జిల్లా కన్వీనర్‌ ఆదిమూలపు ప్రకాష్‌, సీనియర్‌ నేతలు వర్ల దేవదాసు మాదిగ, రావినూతల కోటయ్య మాదిగ పాల్గొన్నారు.